calender_icon.png 20 May, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వాసులకు వరించిన దళిత రత్న అవార్డు

20-05-2025 01:17:18 AM

హన్వాడ మే 19 : హైదరాబాద్ పారడైస్ క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జగ్జీవాన్ రాం అంబేద్కర్ జయంతి  ఉత్సవాల కమిటి చైర్మన్  ఇటిక రాజు మాదిగ ఆధ్వర్యంలో జుట్ల రవి కుమార్, మాదిగ జర్నలిస్టు ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కేశవులు  లలకు దళిత రత్న అవార్డు వరించింది.

ఈ సందర్భంగా టి. ఎమ్. ఆర్. పి. ఎస్ వ్యవస్థపాక అధ్యక్షుల చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత రత్న అవార్డును తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అవార్డు గ్రహీతలు తెలియజేశారు. విద్య, సమాజ సేవ, జాతి అభ్యునతికి పాటు పడే మాదిగ జాతి యువకులకు ప్రోత్సహించే విదంగా ఈ అవార్డులకు ఎన్నిక చేయడం జరిగిందని, అవార్డులు అందుకున్న ప్రతీ ఒక్కరు జాతి అభ్యున్నతికి భాద్యతయుతంగా పనిచేస్తామని వారు తెలిపారు.