calender_icon.png 1 November, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెదిరింపులకు భయపడొద్దు

01-11-2025 12:29:05 AM

  1. ప్రజలకు అండగా ఉంటాం
  2. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది
  3. ఒక్క హామీని కూడా అమలు చేయలేదు
  4. ప్రజలు తెలివిగా ఆలోచించి బుద్ధి చెప్పాలి
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) :  కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజల పై బెదిరింపులకు దిగుతున్నారు.. వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు.. తాము ఎప్పటికీ అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చా రు. జూబ్లీహిల్స్‌లో ప్రజలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పనిచేసి కారు గుర్తుకు ఓటే సి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో పలువురు ఎంఐఎం నేతలకు గు లాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాం గ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి  అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఒక్క హా మీని కూడా అమలు చేయలేదని ఫైరయ్యా రు.

ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండే ళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పా లని ప్రజలను కోరారు. డబ్బులు ఇచ్చి ప్ర లోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఆ డబ్బులు తీసుకొని మిగతా బా కీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలన్నా రు. ఇవి కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. పేదల ఇం డ్లు కూలగొట్టిన ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.