calender_icon.png 1 November, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేక్ కట్ చేస్త్తావనుకుంటే.. శవపేటికలో వచ్చావా!

01-11-2025 12:23:23 AM

-పుట్టినరోజునే డెత్ డేగా మార్చుకున్న కల్పన

- మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయి శవాలై తేలిన యువదంపతులు

హుస్నాబాద్, అక్టోబర్ 31 : ప్రేమ పంచుకోవాల్సిన జీవితం, పూలబాటపై నడవాల్సి న యవ్వనం రెండంటే రెండు రోజుల్లోనే కడతేరిపోయింది. ఆ దంపతుల ఆశల సౌధం, భవిష్యత్తుపై వారు కన్న కలలు మోత్కుపల్లి వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మో త్కుపల్లి వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన యువ దంపతులు కల్పన, ప్రణయ్ల మృతదేహాలు శుక్రవారం దొరకడంతో రెండు రోజుల నిరీక్షణ తర్వాత ఆ కుటుంబాలలో తీవ్ర విషాదం అలుముకుంది.

* గుండె పగిలే నిజం

ఈ విషాదంలో అత్యంత హృదయ విదారకమైన అంశం ఏంటంటే, కల్పన పుట్టినరో జు నాడే ఈ ఘోరం జరగడం. హనుమకొం డ జిల్లా, భీమదేవరపల్లి గ్రామానికి చెందిన కల్పన, ప్రణయ్లు బుధవారం రాత్రి భీమదేవరపల్లి నుంచి కల్పన పుట్టిన ఊరైన అక్కన్న పేటలో తన తల్లి, చెల్లె, తాతయ్య, నానమ్మ దగ్గర తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని బయల్దేరారు. కేవలం సంతోషాన్ని, ఆత్మీయతను పంచుకోవాలన్న ఆరాటం  వా రిని మృత్యువు అంచులకు చేర్చింది. పుట్టినరోజు కేకును కోసి, నవ్వులు పండించాల్సిన చేయి... ఇప్పుడు నిశ్శబ్దంగా కదలకుండా పడి ఉంది. కల్పన పుట్టినరోజు ఆమెకు డెత్ డేగా మారడంతో భీమదేవరపల్లి, అక్కన్నపేట గ్రామాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి.

* మృత్యువు ఒడికి చేరిన ప్రయాణం

 బుధవారం రాత్రి మోత్కుపల్లి వాగు వద్ద నీటి ఉద్ధృతిని అంచనా వేయలేక వారు బైకుపై అలానే రావడంతో ప్రవాహంలో కొ ట్టుకుపోయారు. ఆ గంభీరమైన ప్రవాహం వారి ప్రాణాలను కబళించింది. వాగు ప్రవాహంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర కు కొట్టుకుపోయిన ఆ యువ జంట, చివరికి మల్లంపల్లి చెరువుకు పెద్ద తండా సమీపం లో ఉన్న ఒడ్డుకు శవాలై కొట్టుకువచ్చారు.

 బంధువుల రోదనలు

రెండు రోజుల పాటు కండ్లలో ఒత్తులు వేసుకొని, వాగు ప్రవాహం వద్ద నిరీక్షించిన కుటుంబ సభ్యులు, బంధువులు... మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. యువజంట జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం, అందులోనూ కల్పన పుట్టినరో జునే ఈ ఘోరం జరగడం అందరినీ కంటత డి పెట్టించింది. ’మా కల్పన పుట్టినరోజే మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది’ అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేసిన రోద నలు ఆకాశాన్ని తాకాయి. నలుగురితో సం తోషంగా పంచుకోవాల్సిన వేడుక, గుండెల నిండా విషాదాన్ని, కన్నీటిని మిగిల్చి వెళ్లిపోయింది. ప్రేమగా మొదలైన వారి ప్రయా ణం, కడవరకు మిగిల్చింది తీరని దుఃఖాన్ని మాత్రమే.

  హృదయవిదారక రోదనలు

‘ఓ కల్పనా! నీ పుట్టినరోజు రోజునే నాకు చావు వార్త వినిపించిపోయావా? నిన్ను కళ్లా రా చూద్దామని ఎదురు చూస్తే.. కనీసం కళ్లు కూడా తెరవలేని దాన్ని చేశావా?‘ అంటూ కల్పన తల్లి రోదించిన తీరు అక్కడ ఉన్న వారి గుండెలు పిండేసింది. ’మా కండ్ల ముం దే పెండ్లి చేసి పంపించాం. ఇలా కట్టెలుగా వస్తారని అనుకోలేదు’ అంటూ బంధువులు విలపించారు. ప్రణయ్ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. రెండు రోజుల క్రితం నవ్వుతూ బైక్ ఎక్కి వెళ్లిన ఆ జంట, ఇ ప్పుడు నిర్జీవంగా పడి ఉండడం చూసి భీమదేవరపల్లి, అక్కన్నపేట గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పుట్టినరోజు... అంతిమ దినంగా

పుట్టినరోజు అనేది జీవితంలో కొత్త ఆశలకు నాంది. కానీ, కల్పన విషయంలో అది మృత్యువుకి స్వాగతం పలికింది. కల్పన బర్త్డే డెత్ డేగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. పుట్టినరోజు కేకు, కొవ్వొత్తులు, కానుకలు... అన్నీ కలగా మిగిలిపోయాయి. మోత్కుపల్లి వాగులో కొట్టుకు పోయిన రెండు జీవితాలు, బతికి ఉన్నవారికి తీరని కన్నీటిని మిగిల్చాయి.

విషాదంలో ప్రశ్నాస్త్రాలు!

కల్పన, ప్రణయ్లది కేవలం ప్రమాదకర మరణం కాదు. అది వ్యవస్థాగత నిర్లక్ష్యం కారణంగా జరిగిన దుర్ఘటన. వాగు ఉద్ధృతిలో ఆ యువ దంపతులు కొట్టుకుపోయి శవాలై తేలడం, వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే, ప్రతి వర్షాకాలంలో ఈ మోత్కుపల్లి వాగు కారణంగా ప్రాణాలు పోవడం, రోడ్డు మార్గాలు తెగిపోవడం సర్వసాధారణంగా మారినప్పటికీ, పాలక వర్గాలు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమ వుతోంది. మోత్కుపల్లి వాగు ఉద్ధృతి పెరిగిన ప్రతిసారీ, రాకపోకలు నిలిచిపోతాయి. ఈ మార్గంలో ఉన్న చిన్నపాటి కల్వర్టు ప్రవాహాన్ని తట్టుకునే స్థితిలో లేదు. ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఒక శాశ్వత, ఎత్తున వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వారి మొర ఆలకించలేదు. ఎన్నికల ముందు హామీ లు ఇచ్చి, ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది.

* హెచ్చరిక బోర్డులు ఎందుకు లేవు?

 వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రజలను అటువైపు వెళ్లనివ్వకుండా గట్టి హె చ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫల మైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాగు ప్రవాహం అంచనా వేయకుండా ప్రమాదం వైపు వెళ్లిన ఆ జంట ఎంత పొరపాటు చేసినా, ఈ ప్రాంతంలో ఏండ్ల తరబడి నెలకొన్న మౌలిక సదుపాయాల లోపమే ఈ మరణానికి ప్రధాన కారణంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువ దంపతుల మరణ వార్త తెలిసిన వెంటనే, రాజకీ య నాయకులు రంగంలోకి దిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గల్లంతైన ప్రణయ్, కల్పనల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘ఈ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. బాధితులను ఆర్థి కంగా ఆదుకుంటాం‘ అని మంత్రి హామీ ఇచ్చి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

సామాజిక కోణం ప్రజల గుణపాఠం

ప్రణయ్, కల్పనల విషాదకర మరణం ఒక తీవ్రమైన గుణపాఠాన్ని నేర్పింది. కల్పన పుట్టినరోజు వేడుక చేసుకోవాలనే ఆరాటం, ప్రణయ్ ఆమెను సురక్షితంగా అక్కన్నపేటకు చేర్చాలనే తపన... రెండూ కలిసి వారిని మృ త్యువు వైపు నడిపాయి. అతి ఉత్సాహం, తొందరపాటు ఎప్పుడూ ప్రమాదకరమేనని ఈ సంఘటన నిరూపించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వాగులు, వంకల ఉద్ధృతిని తక్కువగా అంచనా వేయడం మా మూలే. ప్రాణాలను పణంగా పెట్టి ప్రయా ణం చేయకూడదనే స్పృహ, జాగ్రత్త అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేసింది.

ల్పన, ప్రణయ్ల మృతదేహాలు మల్లంపల్లి చెరువు ఒడ్డుకు కొట్టుకు రావడం కేవలం రెండు జీవితాల ముగింపు మాత్రమే కాదు. ఇది ఈ ప్రాంతంలో నెలకొన్న మౌలిక సదుపాయాల వైఫల్యానికి, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. మంత్రి హామీ ఇచ్చినా, ఆ కుటుంబాల రోదనలు ఇప్పట్లో ఆగేవి కావు. తక్షణమే ఆ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టి, ఇంకో ప్రాణం బలి కాకుండా చూసుకోవడమే, ఆ అమాయక జంటకు మనం ఇచ్చే నిజమైన నివాళి.