16-04-2025 08:25:47 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తాజా మాజీ మండల సర్పంచ్ ల ఫోరమ్ గౌరవ అధ్యక్షులు దార సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని మల్లేశం పల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని పేర్కొన్నారు. మద్దతు ధరతో పాటు బోనస్ ను కూడా ఇస్తుందని రైతులు ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులకు కావలసిన మౌలిక వసతులను కల్పిస్తుందని అన్నారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొంది ఆర్థికంగా లాభం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, ఐకెపి సీఏ అనిత, రైతులు కిషన్, బాబా తదితరులు పాల్గొన్నారు.