29-07-2025 12:16:43 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, జూలై 28 (విజయక్రాంతి): కేటీఆర్, కవితల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరని స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటూపడిందన్నారు.
కొంతమంది దొంగలు మాస్టర్ ప్లాన్ ను తప్పుదారు పట్టించి సబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మొదటిగ 120 మంది అర్హులకు ఆగస్టు 15 లోపు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మూడు విడుదలగా విచారణ జరుగుతుందని నిజమైన అర్హులను ఎంపిక చేసిన ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తుందన్నారు.
6 గ్యారంటీలను పక్కాగా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, రైతులకు రైతుబంధు, వృద్ధాప్య పింఛను, కల్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ తదితర పథకాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజా చర్చకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి శ్రీనివాస్ రావు, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, జక్కుల రవీందర్ యాదవ్, వేముల శ్రీనివాస్ అనుబంధ సంఘాల చైర్మన్ లు బంక సరళ, విక్రమ్, అజిజ్ ఉల్లా, పెరుమాండ్ల రామకృష్ణ, రాజ్ కుమార్, శ్రవణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు నాయకులు లక్ష్మారెడ్డి, బంక సంపత్, గుంటి స్వప్న, రహీమున్నీసా పాల్గొన్నారు.