calender_icon.png 31 July, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ కబంధహస్తాల్లో విలవిలలాడుతున్న చదువు

29-07-2025 12:14:24 AM

సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి

హనుమకొండ, జులై 28 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా విధానాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లో చేరి విలవిలాడుతుందని చూసి రాసే పద్ధతులకు స్వస్తి చెప్పి నిజాయితీగా చదువుకొని ఉన్నత శ్రేణిలో రాణిస్తున్న విద్యార్థుల మనోభావాలు దెబ్బతీయకుండా  చూడాలని కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతూ కాపాడాలని  సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి ఆవేదనను వ్యక్తం చేశారు.

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా ను స్నేహ పిక్చర్స్ ఆధ్వర్యంలో నిర్మించి ఆగస్టు 22న విడుదల కాబోతుందని ప్రజలు అన్ని వర్గాల విద్యార్థి సంఘాలకు అతీతంగా మంచి ఉద్దేశపూర్వకంగా సినిమా తీశామని అందరూ తిలకించి ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కసర బోయిన రవితేజ, జిల్లా సమితి సభ్యులు,  సిపతి వినయ్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, పిడిఎస్యు యూనివర్సిటీ అధ్యక్షుడు విజయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్, నాయకులు వినయ్, హర్షద్, తదితరులు పాల్గొన్నారు.