calender_icon.png 10 May, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మమ్మల్ని నిందించకండి

24-04-2025 01:51:10 AM

పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్మూ ఉగ్రదాడికి పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ పేర్కొన్నారు. భారత్‌లో దాడులు జరిగిన ప్రతిసారి మమ్మల్ని నిందించడం సరికాదు. భారత్‌లో అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగున్నాయని ఆయన పేర్కొన్నారు.

‘ప్రజలు తమ హక్కుల గురించి అడుగుతున్నారు. స్వదేశీ సంస్కృతి, హిందుత్వ శక్తులు ప్రజల్ని దోపిడీ చేస్తూ.. మైనార్టీలను అణచివేస్తున్నాయి. అనేక వర్గాల వారిని కొన్ని మూకలు పొట్టనపెట్టుకుంటున్నాయి. అందుకే ఈ ఉద్యమాలు జరుగున్నాయి. మా దేశం ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వదు’ అని పేర్కొన్నారు.