calender_icon.png 10 May, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుపాకులు లాగి వీరోచితంగా పోరాడి

24-04-2025 01:48:22 AM

ప్రాణాలొదిలిన హార్స్ రైడర్ సయీద్ ఆదిల్ 

అనంత్‌నాగ్, ఏప్రిల్ 23: పహల్గాం ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరపుతుంటే స్థానిక హార్స్‌రైడర్ సయీద్ అదిల్ హుస్సేన్ షా వీరోచిత పోరాటం చేశాడు. ఉగ్రవాదుల తుపాకీ లాక్కొనేందుకు ప్రయత్నించాడు.

సయ్యద్ తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఉగ్రవాదులు కాల్పులు జర పడంతో ప్రాణాలు కోల్పోయాడు. పహల్గామ్ నుంచి బైసరన్ లోయకు చేరుకోవాలంటే రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి కాలినడకన, మరొకటి గుర్రాలపై వెళ్లడం. అయితే మంగళవారం మధ్యా హ్నం బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో వారిని కాపాడేందుకు సయ్యద్ ఆదిల్ గొప్ప పోరాటం చేశాడు.

టూరిస్టులపై కాల్పులు జరుపుతుండగా గమనించిన సయ్యద్ వారిని అడ్డుకునే క్రమంలో తూటాలకు బలయ్యాడు. సయ్యద్ హుస్సేన్ మృతితో అతడి కుటుంబం రోడ్డున పడినట్టయింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, తమ కుమారుడిని చంపిన ఉగ్ర వాదులను మట్టుబెట్టాలని సయ్యద్ తండ్రి హైదర్ షా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.