calender_icon.png 10 December, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సమయంలో విద్వేషాలకు పోవద్దు

08-12-2025 12:55:47 AM

సీఐ చరమందరాజు 

మఠంపల్లి, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): ఎన్నికల సమయంలో విద్వేషాలకు పోవదని హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు అన్నారు.ఆదివారం మఠంపల్లి మండలంలోని సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు మఠంపల్లి పోలీస్ స్టేషన్ నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ఎన్నికల నియమావళి గురించి వివరించడం జరిగింది.మఠంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక గ్రామమైన రామచంద్రపురం తండా నుండి బరిలో నిలిచిన సర్పంచ్,వార్డ్ అభ్యర్థులకు  పోలీస్ స్టేషన్ నందు వారు  అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి గొడవలు పెట్టుకోవద్దు అని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారం చేసే సమయంలో ఒకరినొకరు విద్వేష పూరితంగా విమర్శించు కోవదని,ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దని గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకూడదని సూచించారు. గ్రామం నుండి కొంత మంది వ్యక్తులను బైండోవర్ చేయడం జరిగిందని బైండోవర్ నిభందనలు ఉల్లంఘిస్తే అలాంటి వారి నుండి పూచీకత్తు నగదును జప్తు చేయించడం జరుగుతుందని  హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.