3 March, 2026 | 4:04 PM

హోలీ సంబరాల్లో ఐక్యత భావం చాటిన మర్రిగూడ యువత

03-03-2026 02:26 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): హోలీ సంబరాల్లో మర్రిగూడ యువత ఐక్యత  భావంతో కుల మతాలకతీతంగా రంగులు చల్లుకొని హోలీ పండుగను మంగళవారం మర్రిగూడెం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ ఆధ్వర్యంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. యువత డీజే సౌండ్ లో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ప్రకృతి రంగులు చల్లుకుంటూ  ఆనందోత్సాహాలతో యువత చిన్నారులు పండుగలో పాల్గొన్నారు