15 April, 2026 | 12:38 AM

ఓడిపోయినా అధైర్య పడొద్దు

16-12-2025 12:32 AM

రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే, మాజీ మంత్రి  డా.సి.లక్ష్మారెడ్డి 

నవాబ్‌పేట, డిసెంబర్ 15 : మండల కేంద్రంలో నూతనంగా విజయం సాధించిన బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్‌లను మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో  పోరాడి విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. ఓడిపోయిన వారు అధైర్య పడొద్దని రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు.గ్రామాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే కనిపిస్తున్నాయని...కాంగ్రెస్ రెండేళ్లలో గ్రామాలకు చేసిందేమీ లేదన్నారు.

ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడం ప్రభుత్వం పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో  బీఆర్‌ఎస్ సత్తా చాటిందన్నారు. మొదటి విడతలో అధికార పార్టీ కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు పిలుపునిచ్చారు.