calender_icon.png 16 December, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క ఓటేగా అని తీసిపారేయొద్దు

16-12-2025 12:32:35 AM

ఒక్క ఓటుతో దక్కిన పదవి...

మహబూబాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ఒక్క ఓటేగా అని అలుసుగా తీసిపారేయొద్దు.. ఆ ఒక్క ఓటే పదవి దక్కేలా రాజ్యాంగం కల్పించిన హక్కుగా మరోసారి పంచాయతీ ఎన్నికల్లో రుజువైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఓటు, రెండు ఓట్లు, మూడు ఓట్ల తేడాతో పలువురు ప్రత్యర్థుల పై విజయం సాధించి సర్పంచ్, వార్డు మెం బర్ గా అధికార పగ్గాలు చేపట్టడానికి అవకాశం అందిపుచ్చుకున్నారు.

వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ గా పోటీచేసిన కొంగర మల్లమ్మ ఒక్క ఓటుతో విజయం సాధించింది. ఇదే తరహాలో మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రాజా మాన్సింగ్ తండా సర్పంచుగా ఎన్నికల బరిలో నిలిచిన గూగులోత్ పటేల్ నా యక్ ఒక్క ఓటు తేడాతో సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆ గ్రామంలో 479 ఓట్లు సర్పంచ్ ఎన్నికల్లో పోల్ కాగా, పటేల్ నాయక్ కు 236 ఓట్లు రాగా, ప్రత్యర్థి జాటోత్ కుమార్ కు 235 ఓట్లు లభించాయి.

8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రీకౌంటింగ్ నిర్వహించి చివరకు ఒక్క ఓటు తేడాతో పటేల్ నాయక్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదే తరహాలో జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దాపురం గ్రామ సర్పంచ్ మూల స్రవంతి తన ప్రత్యర్థి పై కేవలం రెండు ఓట్ల ఆదిత్యతో విజయం సా ధించారు. ఇదే జిల్లా ఆముదాలపల్లి గ్రామ సర్పంచ్ గా ఇచ్చేంతల విష్ణు కూడా కేవలం మూడు ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

మహబూబాబాద్ జిల్లా దంతా లపల్లి గ్రామ పదో వార్డు మెంబర్ పదవికి పోటీ చేసిన అర్జున్ ఒక ఓటు తేడాతో ప్రత్యర్థి పై విజయం సాధించి వార్డు మెంబ ర్ గా ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు ఉండడం వల్ల ఒక్కో ఓటు కూడా ఎంతో విలువైనదని మరోసారి నిరూపించాయి.