07-06-2025 12:00:00 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని పెంచే ఆలోచనని రాష్ట్ర సర్కారు విరమించుకోవాలి. ఎన్నో ఏళ్లనుంచి సర్కారు కొలువులకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశలమీద ఇలా నీళ్లు చల్లే నిబంధనలు తొలగించాలి. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంచినప్పుడు ప్రస్తుతం ఉన్న పాలకులు అప్పటి సర్కారు నిర్ణయాన్ని ఎదిరించి పోరాడి, ఇప్పుడు మళ్లీ వారే అటువంటి పనికి పూనుకోవడం దారుణం.
కాబట్టి, రాష్ట్ర సర్కార్ నిరుద్యోగ యువతని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల వయస్సు పెంచే ఆలోచనని మానుకోవాలి. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి. ఉద్యమకారులకు గుర్తింపుకార్డులు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
ముచ్కుర్ సుమన్ గౌడ్