28 August, 2026 | 11:24 PM

బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు తండ్రి రామయ్య కన్నుమూత

28-08-2026 10:22 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పి.నాగేశ్వరరావు తండ్రి కీ.శే. పి. రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రామయ్య మృతి పట్ల బాన్సువాడ మండల ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఎంఈఓ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. రామయ్య అంత్యక్రియలు బోధన్ గంజ్ రోడ్‌లోని వారి స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషాద సమయంలో నాగేశ్వరరావు కుటుంబానికి పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.