28 August, 2026 | 11:04 PM

ఘనంగా రక్షాబంధన్

28-08-2026 10:01 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. అక్కా, చెల్లెల్లు అన్నదమ్ములకు ఆప్యాయంగా రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి, మంగళ హరతులు ఇచ్చి ఆశీర్వదించారు. రాఖీ పండుగను మంచిర్యాల ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి బస్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడాయని, రోడ్లన్ని రద్దీగా తయారయ్యాయి.