calender_icon.png 7 June, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామాకును లైట్ తీసుకోకండి

01-06-2025 12:00:00 AM

కర్పూరవల్లి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధ మొక్క. దీన్ని కుండీల్లో ఎక్కడైనా పెంచుకుంటుంటారు. వామాకు అని కూడా పిలుస్తారు. ఇంటి చుట్టుపక్కల, కుండీల్లో ఎక్కడైనా దీన్ని పెంచుకుంటారు. అయితే చాలామంది ఈ వామాకుతో బజ్జీలు, పచ్చడి సహా ఇతర వంటలు చేస్తుంటారు. అయితే దీన్ని కేవలం వంటల్లో ఉపయోగించడానికి మాత్ర మే కాకుండా నేరుగా తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఈ ఆకులు జలుబు, దగ్గు, లారింగైటిస్, బ్రోన్కైటిస్, ముక్కు దిబ్బడ, నో టి, గొంతువాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వామాకును మరిగిం చి, ఆవిరి పడితే ఛాతీలో పేరుకున్న కఫం కరుగుతుందని, అంతేకాకుండా ఈ ఆకు రసాన్ని ఛాతీపై పూసూకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభం అవుతుందని పేర్కొంటు న్నారు. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కూడా ఈ వామా కు దోహదపడుతుంది. ఆయుర్వేదంలో దీన్ని కడుపు ఉబ్బరం, అలసట, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, శ్వాసకోవ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి వివిధ చికిత్సలకు ఉపయోగిస్తారు. 

వామాకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఆకలి తక్కువగా ఉన్నవారిలో ఆకలిని పెంచడానికి కూడా ఇది దోహదపడతుందని నిపుణులు చెబుతున్నారు.

భోజనం తర్వాత కొన్ని ఆకులను నమిలితే జీర్ణక్రియ సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు. వామాకు కషాయం తాగడం వల్ల కిడ్నీల్లో ఉప్పు నిల్వలు కరిగిపోతాయని పలు అధ్యయనాల్లో తేలినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడిస్తున్నారు.