calender_icon.png 7 June, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాల్చిన చెక్క పొడితో..

01-06-2025 12:00:00 AM

ఊబకాయం, బరువు వంటి సమస్యలతో చాలామంది బాధపడు తుంటారు. అధిక బరువు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు ఊబకాయంతో వస్తాయని నిపుణు లు చెబుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది జిమ్, వ్యాయామం, యోగా, డైట్ వంటి వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు. దాంతో పాటు పాలల్లో చిటికెడు మసాలా కలుపుకుని తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

ప్రతిరోజూ పాలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే దాల్చిన చెక్కతో చేసి న మసాలాను పాలల్లో కలుపుకుని తీ సుకుంటే నెలలోపు బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు పాలల్లో కలిపి తాగితే.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదే విధంగా షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది.