7 May, 2026 | 1:01 AM

నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు

07-05-2026 12:27 AM
  1. ఏయిర్‌పోర్టు వద్ద ట్రాఫిక్ జామ్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం
  2. ట్రాఫిక్ నియంత్రణకు ‘ట్రాఫిక్ బ్యూరో’ డీజీపీ సీవీ ఆనంద్  

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లే సమయంలో .. విమానాశ్రయం వద్ద ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని సీఎం స్పష్టం చేశారు, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టొద్దని డీజీపీ సీవీ ఆనంద్‌కు సీఎం సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో డీజీపీ వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలపై క్షేత్ర స్థాయి అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ క్రమద్దీకరణ కోసం త్వరలో ట్రాఫిక్ బ్యూర్ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో సింగిల్ లైన్‌లో వాహనాలు పంపాలని, ఏయిర్‌పోర్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ ఆదేశించారు. 

సీఎం, పీసీసీ చీఫ్‌కు కృతజ్ఞతలు: దూడం వెంకటేష్ 

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న తనకు తెలంగాణ రాష్ట్ర హండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని దూడం వెంకటేశ్ తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు గొప్ప అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.