ఆందోళన చెందొద్దు
25-04-2024 12:55 AM
ఫెయిల్ అయిన వారు ఆందోళన చెందొద్దని, ఇదే జీవితం కాదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విద్యార్థులకు సూచించారు. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, వ్యాపారవేత్తలు ఫెయిలై ఆ తర్వాత విజయం సాధించినవారేనని అన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలకు బాగా చదివి రాయాలని కోరారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అఫిలియేషన్ ప్రక్రియను వచ్చే నెలలో పూర్తి చేస్తామని చెప్పారు. మిక్స్‌డ్ ఆక్యూపెన్సీ కళాశాలలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ఇంటర్ అడ్మిషన్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
బుర్రా వెంకటేశం,
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి






