కరీంనగర్ శ్రీచైతన్య విజయభేరి
కరీంనగర్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఎంపీసీ ద్వితీయ ఫలితాల్లో భూక్య ప్రశాంత్ 988, జీ మహాలక్ష్మి 988 మార్కులు, బైపీసీలో ఎం వివేక్ 987, ఎంఈసీలో టీ హారిక 965, సీఈసీలో జే ప్రశాంత్ 972 మార్కులను సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఆర్ వైష్ణవి 468, జీ శ్రీనిత్య 467, బీ వర్షిత్ 467, బీ అక్షర 467, ఎస్ విష్ణువర్ధన్ 467 మార్కులను సాధించగా, మరో 14 మంది విద్యార్థులు 466 మార్కులను సాధించారని తెలిపారు. బైపీసీలో ఎస్ భార్గవి 436, ఎస్ మేఘనశ్రీ 436, ఎ అభ్యుదయ 436, జీ మధుహాసిని 435 మార్కులను సాధించారని చెప్పారు. ఎంఈసీలో ఆర్ హన్సిక 473, సీఈసీలో ఎ మధుమిత 484 మార్కులను సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను చైర్మన్ రమేశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్‌మోహన్‌రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్స్‌పల్స్ మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






