ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ చారిత్రక విజయం
కరీంనగర్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులను సాధించి సంచలనం సృష్టించారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు టీ శృతి 468, ఏ శ్రీహిత 468, వీ ప్రణవి 468, ఏ శశిప్రీతం 468, కే వర్షిత్ 468, కే రుత్విక్ 468, ఎస్ కార్తికేయ 468, కే సృంజల్ 468, టీ వర్షిత 468, ఎం శ్రీవర్ష 468, పీజీ ప్రియామృత 468, కే వర్షిణి 468, ఈ ప్రసన్న 468, ఎం రుత్విక 468, జీ లక్ష్మీప్రసన్న 468, కే అభిలాష్ 468 మార్కులతో 16 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచా రు. మరో 65 మంది విద్యార్థులు 467 మా ర్కులు, 117 మంది విద్యార్థులు 466 మార్కులను సాధించడం విశేషం. బైపీసీ విభాగంలో 440 మార్కులను గానూ బీ నీలిమ 438 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచింది. మరో 8 మంది 437 మార్కులు, 25 మంది 436 మార్కులను సాధించారు.
ఎంఈసీ విభాగంలో 500 మార్కులను గానూ టీ అఖిల్ 494 మార్కులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు. ఎం సహస్రరెడ్డి 493 మార్కులు, వీ అక్షయ్ వర్థన్ 493 సాధించారు. సీఈసీ విభాగంలో ఎస్ సృష్టిత 492, బీ గ్రీష్ట 491 మార్కులను సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు కే కార్తికాబాబు 993, టీ సాహిత్య 993 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించగా.. ఎల్ హర్షిత 992, బీ నిహారిక 992, ఎం పల్లవి 992, డీ శివాంజలి 991, పీ విశ్వాణి 991, కే మిశ్రా 991, ఎల్ అస్మిత 991, మారియామావిన్ 991, జీ ఉమాకాంత్ 991 మార్కులు సాధించగా మరో 20 మంది 990 ఆపై మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు సీహెచ్ నిరిల్ 990, బీ అమిత 990, ఏ శ్రీనిధి 990 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో 1000 మార్కులకు ఎం వినమ్రత 974, జీ మహేశ్‌కుమార్ 974 మార్కులు సాధించారు. సీఈసీ నిమ్రా అజ్మి 978, ఎస్ నజీర్ 972 మార్కులు సాధించారు. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అభినందించారు.






