24 May, 2026 | 3:34 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

ప్లాస్టిక్ నివారణపై ఇంటింటి ప్రచారం

30-03-2026 02:14 AM

సూర్యాపేట, మార్చి 29 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని 17వ వార్డు చింతలచెరువులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణంను కాపాడదాం అనే అంశంపై  చేతి సంచితో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వీధి ప్రజలకు ప్లాస్టిక్ నివారణపై, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి ఇంటింటికి స్టిక్కర్ అంటించారు. అనంతరం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, వార్డు కౌన్సిలర్ బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడుతూ కాలుష్య నివారణకు ప్లాస్టిక్ వాడొద్దని, చేతి సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తోటకిరణ్,అలేఖ్య, బొలిశెట్టి మధు, మిర్యాల వెంకటేశ్వర్లు, సోమ హేమమాలిని, మిట్టపల్లి సువర్ణ లక్ష్మి, యమా రజిని, తల్లాడ రామచంద్రయ్య, సోమ సురేష్, దేవరశెట్టి నాగరాజు, మంచాల శ్యామ్, అరుణ తదితరులు పాల్గొన్నారు.