24 May, 2026 | 2:30 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

రాచకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

30-03-2026 02:14 AM

సంస్థాన్ నారాయణపూర్, మార్చి 29 : రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్  పటేల్ రమేష్ రెడ్డిని  ఇఎల్ వి ఫౌండేషన్ చైర్మెన్ భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిసి, వినతిపత్రాన్ని అందజేశారు. రాచకొండను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దేందుకు కేబుల్ వాకింగ్ బ్రిడ్జ్, రోప్వే, కేబుల్ కార్, పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు,

కోట పైభాగానికి చేరుకునే ప్రత్యేక రవాణా సదుపా యాలు ఏర్పాటు చేయాలంటూ భాస్కర్ కోరారు. భాగ్యనగరానికి అతి సమీపంలో ఉన్న రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వినతిని సానుకూలంగా స్వీకరించిన చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రాచకొండలో ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు త్వరలోనే ప్రాంతా న్ని ప్రత్యక్షంగా సందర్శించి, అభివృద్ధి చర్యలను ప్రారంభించేలా తగిన కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.