న్యాయవ్యవస్థలో ప్రజాస్వరం రామిరెడ్డి
సాముల రాంరెడ్డి జీవితం నేటి యువతకు ఆదర్శం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్
హుజూర్‌నగర్, మార్చి 29: న్యాయ వ్యవస్థలో ప్రజాస్వరం హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికైన సాముల రామిరెడ్డి అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ అన్నారు. హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికైన స్థానిక బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సాముల రామిరెడ్డిని సిపిఐ కార్యాలయంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా, అడ్వకేటుగా,బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాంరెడ్డి అంచెలంచె లుగా ఎదిగిన విధానం నేటి యువతకు ఆదర్శమన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి మారుమూల కోర్టులో ప్రాక్టీస్ చేసి హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికవ్వడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణం అన్నారు.
కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పుస్తక ఆవిష్కరణ
సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు సాముల రామిరెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు...దోపిడికి వ్యతిరేకంగా ఎర్ర జెండాకు జీవం పోసిన మహానేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.సిపిఐ సిద్ధాంతాలకు ప్రతిరూపమే సురవరం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాములు, కంబాల శ్రీనివాస్, గుండు వెంకటేశ్వర్లు,చెన్నగాని సైదులు, జడ శ్రీనివాస్,రాంరెడ్డి, కాల్వ శ్రీనివాస రావు,తదితరులు పాల్గొన్నారు.




