29 June, 2026 | 9:42 PM

ఒక్క ఓటు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు

29-06-2026 08:49 PM

కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయకం భాస్కర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఒక్క ఓటు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయకం భాస్కర్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులతో సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఓటు లేకుండా ప్రజాస్వామ్యం లేదని ప్రజాస్వామ్యంలో ఓటరే విలువైన వ్యక్తి అన్నారు. జవహర్ నగర్ లో 100% నమోదే లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నిలుస్తామన్నారు. అనంతరం తులసి స్కూల్లోని బూత్ నెంబర్ 582లో ఓటర్ జాబితాలోని ఓట్ల వివరాల ఫారమ్స్ ను ప్రతి ఓటు హక్కు ఉన్న  ఓటర్లకు చేరాలనే దృఢ సంకల్పంతో బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లు కలిసి సంయుక్తంగా ప్రతి ఇంటికి ఓటర్ ఫారాలు అందజేయడం జరుగుతుందన్నారు