14,975 మందికి ‘దోస్త్’ సీట్లు
15-08-2026 01:23 AM
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌లో 14,975 మందికి సీట్లను కేటాయించారు. వీరిలో మొదటి ప్రాధాన్యత ద్వారా సీట్లు పొందిన వారు 12,069 మంది ఉన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 16,312 మంది అభ్యర్థు లు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. సీట్లు పొం దిన వారిలో కామర్స్- 6198, ఫిజికల్ సైన్సెస్- 2798, లైఫ్‌సైన్సె స్-3080, ఆర్ట్స్-2878, ఇతరులు-21 మంది ఉన్నారు. ఈ అభ్యర్థులందరూ ఈ నెల 18 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.






