4 August, 2026 | 6:08 PM

దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

04-08-2026 05:05 PM

ముకరంపుర,(విజయక్రాంతి): 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్  ప్రక్రియలో చివరి విడత  షెడ్యూల్‌ విడుదల చేశారు.  ఆగస్టు 6 నుంచి 11 వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, 12తేది వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు, కోర్సులను ఎంపిక, ఆగస్టు 14న సీట్ల కేటాయింపు, సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ కోరారు.