ఇండిపెండెన్స్ డే కానుకగా డబుల్ ఇస్మార్ట్
రామ్ పోతినేని కథానాయకుడిగా వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆయన సరసన కావ్యా థాపర్ నటిస్తోంది. సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలీ, గెటప్ శ్రీను తదితరులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చార్మితో కలిసి నిర్మిస్తున్నారు. గత మార్చిలోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ చిత్రీకరణ పూర్తి కాకపోవటంతో వాయిదా వేశారు.
తాజాగా ఈ సినిమాను వచ్చే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకున్నామని చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. ‘ఇండిపెండెన్స్ డే ఈ సినిమా విడుదలకు సరైన సమయం. స్వాతంత్య్ర దినోత్సవమైన గురువారం సెలవు దినం. ఆ తర్వాత వచ్చే సోమవారం రక్షాబంధన్ సందర్భంగానూ మరో హాలీ డే సినిమాకు కలిసి రానుంది’ అని మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవువుతున్న ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ; సినిమాటో గ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియా న్నెలి.






