ఒలింపిక్స్ ఇన్‌స్టాలో ఇంకేం కావాలే సాంగ్
2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాట సంగీత ప్రియులను ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. నేటికీ ఈ పాట నెట్టింట మార్మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ఈ పాట ఒలింపిక్స్ అధికారిక ఇన్‌స్టా పేజీలో హల్‌చల్ చేస్తోంది. జూలై 26 నుంచి పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఓ ప్రమోషనల్ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఈ పాట వినిపిస్తోంది.
దీనిపై ‘గీత గోవిందం’ హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘కొన్ని పాటలు ఎప్పటికీ ఉండిపోతాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ‘గీత గోవిందం’ చిత్రాన్ని డైరెక్టర్ పరశురాం తెరకెక్కించగా, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా విజయ్ సరసన నటించింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. సిధ్ శ్రీరాం స్వరంలో సంగీతప్రియుల మదిని చేరిన ఈ పాట ఇప్పుడు ఒలింపిక్స్ ప్రచారంలో భాగమవడం విశేషం






