డాక్టర్ ఎం.వి. కోటిరెడ్డి సేవలు ప్రశంసనీయం
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో శుక్రవారం డాక్టర్ కోటిరెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా పాల్గొన్న భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని డాక్టర్ గా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా యం. వి. కోటిరెడ్డి చేసిన సేవలు గణనీయమని అన్నారు. గత 30 సంవత్సరాలు ఏజన్సీ ప్రాంతంలో నిరుపేద ఆదివాసీ గిరిజనులకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందించారు.
వీరి వలన ఎంతో మంది ప్రాణాపాయ స్తితి నుండి కోలుకున్నారని అన్నారు. పినపాక, జానంపేట, చింతూరు, భద్రాచల ప్రాంతాల్లో వైద్యసేలందిస్తూ ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజల ఆధారాభిమానాలు చూరగొన్నారని వారు తెలిపినారు. అలాగే భద్రాచలం ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేసినారని కొనియాడారు. చింతూరు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేసిన ఘనత డాక్టర్ కోటిరెడ్డి కే దక్కుతుందని తెలిపినారు.
అనంతరం అదనపు జిల్లా వైద్యశాఖ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి. సైదులు మాట్లాడుతూ డాక్టర్ గా యం.వి.కోటిరెడ్డి పేడ ప్రజలకు ఆధునికమైన వైద్యసేవలు, ఎనస్తీసియా, జనరల్ సర్జరీ, కాన్పుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సేవలందించినారని తెలిపినారు. ఈ సమావేశంలో మారుతి కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు మాట్లాడుతూ యం. వి. కోటిరెడ్డి పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఏజన్సీ ప్రాంత ప్రజలకు తన సేవలు క్రియాశీలకంగా కొనసాగించాలని కోరారు.






