12 June, 2026 | 8:30 PM

క్యాoపు ఆఫీసులో ఇందిరమ్మ చీరలు పంపిణీ

12-06-2026 07:38 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ఇందిరమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ..మహిళల సంక్షేమం కోసం రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా సాధికారతకు దోహదపడే సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ఆర్పీ లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.