calender_icon.png 16 July, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ సుజాత రెడ్డి

15-07-2025 09:45:01 PM

కరీంనగర్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లో నూతనంగా ఎన్నికైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ సుజాత రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావుకు పుష్పగుచ్ఛం అందజేసి, ఆయన నాయకత్వంలో బిజెపి మరింత బలపడాలని ఆకాంక్షించారు. రామచంద్రరావు నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమవుతుందని డాక్టర్ సుజాత రెడ్డి అభిప్రాయపడ్డారు. వారితోపాటు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కొండూరి అనిల్ కుమార్ విజయ రాజు తదితరులు పాల్గొన్నారు