calender_icon.png 16 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

15-07-2025 09:41:42 PM

మణుగూరు,(విజయక్రాంతి): పివి కాలనీ సింగరేణి హై స్కూల్ 2002–2003 సంవ త్సరంలో పదవ తరగతి చదు వుకున్న పూర్వ విద్యార్థులు ఒకరికి ఒకరు కలుసుకొని మంగళవారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత అందరూ ఒక వేదికపై వచ్చి గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఉద్యోగ, వ్యాపారరీత్యా ఎక్కడె క్కడో స్థిరపడి వాళ్లు కూడా దశాబ్ధాల తర్వాత కలవడంతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని తన్మ యత్వంలో మునిగి తేలారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.  ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు జే.వి. కృష్ణరావు, అరుణ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు యామిని, మాధవరావు, రాజేష్, దుర్గాప్ర సాద్, నాగేశ్వరరావు పాల్గొన్నా రు.