25 April, 2026 | 6:54 PM

డాక్టర్ వేలు ఆనందచారికి పద్మశ్రీ

11-05-2024 02:28 AM

యాదాద్రి భువనగిరి, మే 10 (విజయక్రాంతి) : దేవాలయాలు ఆగమశాస్త్రీయంగా రూపొందడానికి స్థపతులు సారధ్యం వహిస్తారు. శిల్పకళా సౌరభాలతో ఆలయాలను ముక్తిదాయకంగా తీర్చిదిద్ధడంలో ముఖ్యభూమిక పోషిస్తారు. అటువంటి ప్రముఖ ఆలయ ఆగమ శిల్పకళాకారుడు డాక్టర్ వేలు ఆనందచారి. తెలంగాణలో మహిమాన్విత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, శ్రీశై లం, శ్రీకాళహస్తి వంటి చారిత్రక ఆలయాల పునర్నిర్మాణంలో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

గురువారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు పద్మశ్రీ అవార్డును రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. తిరుపతి శిల్పకళాశాలలో ఆలయ ఆగమ శిల్పకళలో అకాడమిక్ శిక్షణ పొందిన ఆయన దాదాపు 5 దశాబ్దాల పాటు దేవాదాయ శాఖలో సేవలు అందించారు.