25 April, 2026 | 8:34 PM

సత్తా చాటిన బివిఆర్‌ఐటి విద్యార్థులు

11-05-2024 02:27 AM

నర్సాపూర్ మే 10 : బెంగుళూరులో ఎల్‌అండ్‌టి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంజి నీరింగ్ హ్యకథాన్ 2024లో నర్సాపూర్ బివిఆర్‌ఐటి విద్యార్థులు మొదటిస్థానం సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవ్ రూబే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగుళూరులో జరిగి న వార్షిక సాంకేతిక పోటీలో దేశవ్యాప్తంగా 503 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 36వే లకు పైగా విద్యార్థులు తమ ప్రదర్శనలను పోటీలో పెట్టారు.

ఇందులో తమ కళాశా లలోని ఈసీఈ విభాగానికి చెందిన విద్యా ర్థులు డిటెక్ట్ అవాయిడ్ సిస్టమ్స్ కోసం ఏఐ ఆధారిత సిట్యూయేషనల్ అవేర్‌నెస్ అల్గా రిథమ్‌పై చేసిన ప్రాజెక్టు నిర్ణేతలను ఆకట్టు కుందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రథమ బహు మతి పొందిన విద్యార్థులకు పది లక్షల రూపాయల నగదుతో పాటు ప్రత్యేక జూరీ అవార్డు అందజేశారని తెలిపారు. కళాశాల చైర్మన్ విష్ణురాజు, కార్య దర్శి ఆదిత్య విశ్వం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారని ప్రిన్సి పాల్ వెల్లడించారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, డీజీఎం కాంతారావు, మేనేజర్ బాపిరాజు పాల్గొన్నారు.