25 April, 2026 | 5:23 PM

Breaking News

బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •  

గోదాముల్లోని ధాన్యం ఏమైనట్టు!

11-05-2024 02:30 AM

12 గోదాముల్లో 23,955.920 మెట్రిక్ టన్నుల నిల్వ 

మిల్లులకు తరలించామంటున్న ఏజెన్సీ నిర్వాహకులు 

మిల్లర్ అక్నాలెడ్జిమెంటు ఇంకా ఇవ్వలేదు : డీఎం గోపాల్

మంచిర్యాల, మే 10 (విజయక్రాంతి) : జిల్లా సివిల్ సప్లయ్ శాఖలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు! ఇంటర్మీడియ ట్ గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం ఇంకా గోదాముల్లోనే ఉందో లేదా మిల్లులకు చేరిందా? అనేది ఇంకా తేలడం లేదు. బయటకు ఎవరైనా అమ్ముకున్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 2021 యాసంగి సీజన్‌లో ధాన్యం ఎక్కువగా రావడంతో సివిల్ సప్లయ్ అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తున్న డీఆర్డీఏ ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల బాధ్యతతో సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడి మార్కెట్ కమిటీ గోదాములను రెండు నెలల పాటు ధాన్యం నిలువ చేసుకునేందుకు 12 గోదాములను కేటాయించింది. 

23,955.920 మెట్రిక్ టన్నులు.. 

జిల్లాలోని మూడు ఏజెన్సీలకు 12 ఇంటర్మీడియట్ గోదాములను సివిల్ సప్లయ్ అధికారులు కేటాయించారు. డీసీఎంఎస్ ఏజెన్సీకి మూడు ఇంటర్మీడియట్ గోదాములు కేటాయించగా వాటిలో 4,404 (భీమారంలో 1,342, కోటపల్లిలో 1,102.080 , లింగాపూర్‌లో 1,958.920) మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి దించి నిలువ చేశారు. డీఆర్డీఏ ఐకేపీ ఏజెన్సీకి ౪ ఇంటర్మీడియట్ గోదాములు కేటా యించగా 7859.080 (భీమారంలో 2534.480, చెన్నూర్‌లో 2036.720, జన్నారంలో 2681.160, వేమనపల్లిలో 606.720) మెట్రిక్ టన్నులు దించారు. పీఏసీఎస్ ఏజెన్సీ ఐదు ఇంటర్మీడియట్ గోదాముల్లో 11,692.840 (చెన్నూర్‌లో 2110.880, జన్నారంలో 1381.880, కాసిపేటలో 3748.680, రేచినిలో 2068.960, వేమనపల్లిలో 2383.240) మెట్రిక్ టన్నులు దిగుమతి చేశారు. ఇలా 12 గోదాముల్లో 23,955.920 మెట్రిక్ టన్నుల ధాన్యం దించారు.

గోదాములన్నీ ఖాళీ.. 

గోదాముల్లో దాదాపు ధాన్యం నిలువలు కనిపించట్లేదు. ప్రస్తుతం రేచిని గోదాములో దాదాపు 1400 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఉంది. మిగతా 11 గోదాముల్లో మచ్చుకు కొన్ని బస్తాలు కనిపిస్తున్నాయి. ఏజెన్సీలను సంప్రదిస్తే ధాన్యమంతా పెద్దపల్లి జిల్లాలోని రెండు మిల్లులకు అలాట్ చేశారని, అంతా పంపించామని సమాధానం చెప్తున్నారు. కానీ, మిల్లుల్లో ఇంటర్మీడియట్ గోదాం ప్యాడీ దించుకున్నట్టు ఎలాంటి అక్నలాడ్జ్‌మెంట్ కాపీలు ఏజెన్సీల వద్ద లేవు. సివిల్ సప్లయ్ శాఖకు అప్పగించలేదు. 

బయటకు అమ్ముకున్నారా?

సాధారణంగా ఎంఎస్‌పీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కానీ, ఇంటర్మీడియట్ గోదాం నుంచి కానీ మిల్లులకు చేరితే అక్కడ బస్తాలు అన్‌లోడ్ అయ్యాక వెంటనే ఎంత సామర్థ్యం గల ధాన్యం, ఏ గ్రేడ్ ధాన్యం వచ్చిందో మిల్లర్ సంతకం చేసి రిసీవ్ ఇస్తా రు. కానీ, ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ నుంచి అక్నలాడ్జ్‌మెంటు కాపీలు పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించకపోవడంతో అసలు ధాన్యం మిల్లులకే పోయిందా? బయటకు ఏమైనా అమ్ముకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ధాన్యం గురించి ఇంటర్మీడియట్ గోదాం నుంచి ఏ మిల్లుకు ఎంత ధాన్యం వెళ్లింది, అది మిల్లుకే చేరిందా అని అసలు పట్టించుకునే అధికారే లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై అదనపు కలెక్టర్ మోతీలాల్‌ను ‘విజయక్రాంతి’ మొబైల్‌లో సంప్రదించగా స్పందించలేదు.

మిల్లర్లు అక్నాలెడ్జ్‌మెంటు ఇవ్వలేదు 

2021 యాసంగి సీజన్‌లో ఇంటర్మీడియట్ గోదాముల్లో డీసీఎంఎస్ ఏజెన్సీ 4,404 మెట్రిక్ టన్నులు, డీఆర్‌డీఏ ఐకేపీ 7859.080 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఏజెన్సీ 11,692.840 మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ చేశారు. రేచినిలో తప్ప మిగితా గోదాముల్లో ధాన్యం మొత్తం మిల్లులకు షిప్ట్ అయ్యింది. కానీ, ఏజెన్సీ వారు మిల్లర్ నుంచి అక్నాలెడ్జ్‌మెంట్ కాపీలు తీసుకువచ్చి మాకు సబ్మిట్ చేయలేదు. చాలా సార్లు నోటీసులు అందజేశాం. ఇన్ని బ్యాగుల ధాన్యం పోయినట్లు లెక్కలు చెప్తున్నారు తప్ప మిల్లుకు ఎన్ని మెట్రిక్ టన్నులు ముట్టిందో మిల్లర్ నుంచి రిసీవ్డ్ కాపీ తేవడం లేదు. ఆ కాపీ ఇస్తేనే మిల్లుకు ధాన్యం చేరినట్టు లెక్క. 

- గెడం గోపాల్, డీఎం సివిల్ సప్లయ్ కార్పొరేషన్, మంచిర్యాల