రూ.3లక్షల నిధులతో డ్రైనేజ్ నిర్మాణం
ప్రారంభించిన సర్పంచ్ మెదరి వీర ప్రతాప్ టోనీ
సింగరేణి, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల కేంద్రంలో శివాలయం సమీపంలో ఎంపీ(MP) నిధులతో మంజూరైన డ్రైనేజ్ నిర్మాణం(Drainage construction) పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ప్రారంభించారు.సుమారు రూ. 3 లక్షల నిధులతో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి నిధుల నుండి మంజూరైన శివాలయం వీధుల్లో డ్రైనేజ్ ప్రారంభోత్సవంలో సర్పంచ్ మెదరి వీర ప్రతాప్ టోనీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ టోనీ మాట్లాడుతూ, గ్రామంలో చాలా కాలంగా డ్రైనేజ్ సమస్య ఉందని, వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఎంపీ రఘురాం రెడ్డి దృష్టికి తీసుకెల్లి మంజూరు చేయించిన ఇమ్మడి తిరుపతి రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు ల కృషి తో వెంటనే రూ. 3 లక్షలు మంజూరు చేశారని, ఆయనకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ డ్రైనేజ్ నిర్మాణంతో శివాలయం పరిసర వీధుల్లో మురుగునీటి సమస్య పరిష్కారం అయిందన్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎంపీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు, ఇమ్మడి తిరుపతి రావు,వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ భాగ్య లక్ష్మీ, వార్డు మెంబర్లు యాకూబ్ , అదెర్ల అంజయ్య,విజయ్ ,కుమార్ , తాజుద్దీన్, తోగర శ్రీను,నారాయణ ,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.