డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
పనులను పరిశీలిస్తున్న 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ
కొత్తగూడెం, ఆగస్టు 23, ( విజయక్రాంతి ): జాతీయ రహదారిపై 16 వ డివిజన్ పరిధిలో జరుగుతున్న,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను 16 వ డివిజన్ కార్పొరేటర్, మునిగడప పద్మ పరిశీలించారు. ఆదివారం కాలువ నిర్మాణం పనులను పరిశీలిస్తూ, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. అసలే వర్షాకాలం డ్రైనేజీ నీరు పూర్తిగా జాతీయ రహదారిపై,ఏరులై పారు తూ వాహనదారులకు ప్రజలకు, ఇబ్బందులు కలిగేలా ఉండకూడదని,
వ్యాపా రస్తు లు ఈ కాలువల ద్వారా అనారోగ్య పాలు అయ్యే అవకాశాలు లేకపోలేదని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ,ఆర్ అండ్ బి ఇరువురు సమక్షంలో సరైన నిర్ణ యం తీసుకొని త్వరితగతిన,పూర్తి చేయాలని తెలియజేశారు. గత 20 రోజుల నుండి చిరు వ్యాపారులు కాలువ నిర్మాణం వల్ల కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె అన్నారు. తక్షణమే నాణ్యత తో కూడిన కాలువ నిర్మాణం చేపట్టి, కాలువ పనులు త్వరిత గతిన పూర్తి చేసి నేషనల్ హైవే కాలువకు ఆనుకొని వ్యాపారం సాగిస్తూ జీవిస్తున్న వ్యాపారులకు సహకరించాలని, ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఆమె వెంట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






