23 August, 2026 | 9:11 PM

ఘనంగా టైక్వాండో కలర్ బెల్ట్ పరీక్షలు

23-08-2026 08:35 PM

ఘట్ కేసర్, ఆగస్టు 23 (విజయక్రాంతి)​ : ఘట్‌కేసర్‌లోని రిషి స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం 'టైక్వాండో కలర్ బెల్ట్ ఎగ్జామినేషన్' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి బ్లాక్ బెల్ట్ 6వ డాన్ , గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, అంతర్జాతీయ కోచ్ కె.పి హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన రిషి స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను అందించి, వారి ప్రతిభకు తగిన బెల్టులను బహుకరించారు.

​ఈక్రీడా కార్యక్రమానికి అనుమతినిచ్చి, ప్రోత్సహించిన రిషి స్కూల్ యాజమాన్య సభ్యులు డైరెక్టర్లు కె. బాబుల్ రెడ్డి, శంకర్, అభినందన్ రెడ్డి, పద్మా రెడ్డి, రవీందర్ రెడ్డి లకు  ప్రిన్సిపాల్ స్వప్న రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సార్‌లతో పాటు మొత్తం స్కూల్ మేనేజ్‌మెంట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

​పిల్లలను క్రీడల్లో ఎంతగానో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు నిరంతరం శిక్షణనిస్తున్న బ్లాక్ బెల్ట్ 1వ డాన్ , గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తెలంగాణ టైక్వాండో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, కోచ్ గ్యార నరేష్ కి అభినందనలు తెలియజేశారు