24 August, 2026 | 1:44 AM

ఫీజు బకాయి బీజేపీ లడాయి

24-08-2026 01:13 AM
  1. నేడు, రేపు బీజేపీ రాష్ట్ర చీఫ్ నిరాహార దీక్ష
  2. విద్యార్థులు, యువత తరలిరావాలి
  3. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు 

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ‘ఫీజు బకాయి  లడాయి’ పేరుతో 40 లక్షల మం ది విద్యార్థుల భవిష్యత్తు కోసం సోమవారం నుంచి రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు తెలిపా రు.  ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అ నుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యా వ్యవస్థ కుదేలైందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు సంజీవని లాం టి సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుం డా తొక్కిపెట్టిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసిస్తూ, విద్యార్థులకు అండ గా నిలిచేందుకు బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమ, మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరాహార దీక్ష చేపడుతారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, బకాయిలు విడుదల చేసేంత వరకు పోరాటం కొనసా గుతుందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వి ద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు వేలాదిగా తరలివచ్చి దీక్షకు మద్దతు తెలపాలని గౌతమ్‌రావు పిలుపునిచ్చారు