18 April, 2026 | 6:56 PM

మార్కెట్‌లో డ్రైనేజీ లేకేజీ..

05-05-2025 02:06 AM

చేవెళ్ల , మే 4 : శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్‌లో ఆదివారం డ్రైనేజీ పైప్‌లైన్ లీక్ అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.  డ్రైనేజీ పైపులైన్లకు, సులభ్ కాంప్లెక్స్ నీరు కూడా తోడు కావడంతో ముగురు నీరంతా రోడ్డుపైనే పారింది.

దీంతో అక్కడి వ్యాపారాలు  ముక్కుమూసుకొని క్రయవిక్రయాలు చేయాల్సి వచ్చింది. వినియోగదారులు సైతం దుర్వాసన భరించలేక ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు.  గత పది రోజుల్లో మూడు సార్లు ఈ పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు.