calender_icon.png 5 May, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

05-05-2025 02:04:31 AM

కుత్బుల్లాపూర్, మే 4 (విజయక్రాంతి): కుటుంబ కలహాలు నేపథ్యంలో ఓ వివాహిత అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ (25)కి డిసెంబర్ 14, -2024లో వివాహం జరిగింది. నగరానికి వచ్చి జీడిమెట్లలోని సుభాష్‌నగర్‌లో గల తమ బంధువుల ఇంట్లో ఉంటుంది.

అయితే తన భర్త, కుటుంబ సభ్యులతో కుటుంబ కలహాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఉదయం లక్ష్మీ తాను ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి  తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.