calender_icon.png 3 May, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బతుకులు ఇంతేనా.. కలెక్టర్ సార్

18-04-2025 10:40:30 AM

తుంగతుర్తి, విజయక్రాంతి: గడిచిన 20 సంవత్సరాలు గా, ప్రజా ప్రతినిధులు మారుతున్న.. ప్రభుత్వ అధికారులు వస్తూ, ప్రత్యేక పాలన అధికారులు ఉన్నప్పటికీ తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న డ్రైనేజీ కంపు, మరొక ప్రక్కన వెంపటిలో గడిచిన 20 సంవత్సరాలకు పైగా వీధిలో గత సిసి రోడ్డు నిర్మాణం పూర్తిగా శిధిలమై, పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేకపోవడంతో అభివృద్ధి కోసం నిధులు రాకపోవడంతో నూతనంగా పనులు చేపట్టకపోవడం మా బతుకులు ఇంతేనా అన్నట్లు వీధి ప్రజలు ప్రతిరోజు అనునిత్యం కష్టాలతో సతమతమవుతున్నారు.వెంపటి వీధిలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా సిసి రోడ్డు నిర్మాణం కనీసం డ్రైనేజీ కూడా లేకపోవడంతో ఈ ప్రాంతంలో తుంగతుర్తి మండలంలో మొట్టమొదటిసారిగా డెంగ్యూ కేసు కూడా నమోదు కావడం జరిగింది.

మండలంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజా ప్రతినిధులు గెలుస్తూ నన్ను చూసి సిగ్గుతో స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు వెళ్ళిపోతున్నారు. మండలంలోని వెంపటి గ్రామంలో ఎంతోమంది ఉన్నతమైన ఉద్యోగస్తులు, ఎన్నారైలు ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధులు రొయ్యు... రొయ్యుమంటూ పూతలు పెట్టుకుంటూ నా పక్కనుండి వెళ్తూ . ఛీ అంటూ... చూసి వెళ్తున్నారు. నా అందం మారటం లేదని ఎక్కెక్కి ఏడుస్తున్నాను . ప్రస్తుతం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద  కోట్ల రూపాయలు. మంజూరైనప్పటికీ నిధుల కొరత అని చెప్పుకుంటూ దాటవేస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికపై వెంపటిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, తుంగతుర్తి లో మెయిన్ రోడ్డుపై డ్రైనేజీ, తుంగతుర్తి ప్రభుత్వ దావకాన పక్క సందులో సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.