ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్షానికి బలం
- పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి
- సమృద్ధిగా వర్షాలు, నిరుద్యోగం పెరిగే అవకాశం
- తెలంగాణ భవన్‌లో వేద పండితుల పంచాంగ శ్రవణం
- హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అ సంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని వేదపండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నా య శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడతాయని వెల్లడించారు.
గురువారం తెలంగాణ భవన్‌లో పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం పఠించా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలి పక్షనేత మధుసూదనాచారి, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు పంచాంగ శ్రవణం చేసి, ఈ ఏడాది పరిస్థితులపై అభిప్రాయాలను వెల్లడించారు.
విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, అయితే ఇరుగు పొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముందని వివరించారు.
వ్యవసాయరంగంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని తెలిపారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పారు. అయితే బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని తెలిపారు.
భూకంపాలు, రైలు, విమాన ప్రమాదాలు
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరింత గౌరవాన్ని పొందుతుందని, వాణిజ్య రంగం లో దేశం రాణిస్తుందని పండితులు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, మానవతా విలువలు పెరుగుతాయని, విడాకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉన్నత పదవు ల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతా ల్లో తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు.
రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని, సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశముందని కూడా తెలిపా రు. ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎ దుర్కొనే పరిస్థితులు ఉండవచ్చన్నారు. పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుంద ని, సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో మిశ్రమ పరిస్థితులుంటాయన్నారు.




