31 May, 2026 | 10:27 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

అసెంబ్లీ, మండలిలో విప్‌ల నియామకం

20-03-2026 12:30 AM
  1. అసెంబ్లీలో విప్‌లుగా యెన్నెం, విజయరమణరావు, వేముల
  2. మండలిలో అద్దంకి, బల్మూరు 
  3. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ  
  4. అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా మల్‌రెడ్డి లేదా రామ్మోహన్‌రెడ్డికి చాన్స్
  5. డిప్యూటీ స్పీకర్‌గా రాంచంద్రనాయక్ పేరు ప్రతిపాదించినా.. అధికారికంగా ప్రకటించని అధిష్ఠానం 

హైదరాబాద్, మార్చి19 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర శాసనసభా, శాసన మండలిలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత వే గవంతం చేసేందుకు, సభా వ్యవహారాలను మన్వయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీలో ము గ్గురు సీనియర్ ఎమ్మెల్యేలను, శాసన మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలను విప్‌లుగా నియ మిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.

అసెంబ్లీలో విప్‌లుగా ని యమితులైన వారిలో పెద్దపెల్లి ఎమ్మెల్యే వి జయరమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మె ల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. శాసన మండలిలో విప్‌లుగా నియమితులైన వారిలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ ఉన్నా రు. ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ విప్‌లుగా ఆది శ్రీనివాస్, ప్రస్తుతం మంత్రి అ డ్లూరి లక్ష్మణ్‌కుమార్, బీర్ల అయిలయ్య, రాంచంద్రనాయక్‌ను నియమించారు.

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంత్రిగా నియమించగా, రాంచంద్రనాయక్‌కు డిప్యూటీ స్పీకర్ గా నియమించాలని పార్టీ నిర్ణయించినా డి ప్యూటీ స్పీకర్‌గా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఇంకా విప్‌గానే కొనసాగుతు న్నారు. ఇక ప్రభుత్వ చీఫ్ విప్ పదవి మొద టి నుంచి ఖాళీగానే ఉన్నది. ప్రభుత్వ చీఫ్ పదవి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నా రు.

ఇబ్రాహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కావాలని పట్టుపడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు లేదని, తమకు అవకాశం ఇ వ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి చీఫ్ విప్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. 

సభలో విప్‌లదే కీలక పాత్ర.. 

కాగా, శాసన సభా, శాసన మండలి నిర్వహణలో విప్‌లదే కీలక పాత్ర ఉంటుంది. స భలో ఏదైనా బిల్లులపై ఓటింగ్ జరిగినప్పు డు లేదా ముఖ్యమైన చర్చలు జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యే లా చూడటంలో విప్‌ల పాత్ర కీలకంగా ఉం టుంది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు ఓటు వేయకుండా పార్టీ లైన్‌ను అ మలు చేయడం వారిపైన ప్రధాన బాధ్యత ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు, ఇతక కీలక సేషన్ల నేపథ్యలో ఈ నియామకాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. తాజా ఈ ని యామకాలపై సదరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. 

14 డీసీసీలకు కార్యవర్గం ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు గాను కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే 33 జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించగా, తాజాగా 14 డీసీసీ కమిటీలను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ డీసీసీ కమిటీలను ప్రకటిం చారు.

పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి పదవులతో పాటు పూ ర్తిస్థాయి కమిటీలనునియమించారు. ఉగాది సందర్భంగా నిర్ణయం వెలువవరించారు. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, మెదక్, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్, వనపర్తి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, యాద్రాది భువనగిరి కలిగి మొత్తం 14 డీసీసీ కమిటీలను ప్రకటించారు.