గుర్రంగూడ ఫారెస్ట్ పరిధిలో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి
ఎల్బీనగర్, జూన్ 2 : గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో డ్రైనేజీ పనులు పూర్తి చేసి, ఉద్యానవనం పనులు చేపట్టాలని అధికారుల ను మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి కోరారు. మంగళవారం గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ ఆ ఫీసులో సమన్వయ సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాబ్జీరావ్, ఎంఎంసీ హయత్ నగర్ స ర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్వామి, జలమండలి సీజీఎం నాగేందర్, బీఎన్ రెడ్డి నగర్ డి విజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, గుర్రంగూడ మాజీ కౌన్సిలర్ లక్ష్మారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కస్నా నాయ క్, జలమండలి మేనేజర్ సిరివెన్నెల, భవ్యారెడ్డి, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ... బీఎన్ రెడ్డి నగర్ కాలనీ, హ రిహర పురం కాలనీ, గాంధీనగర్ పొడువు నా విస్తరించి ఉన్న ఫారెస్ట్ ను అతి త్వరలోనే ఉద్యాన వనంగా మారుస్తున్నారని తెలిపా రు. ఉద్యానవనం పనులకు ముందుగా సా గర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీలో వైపు నుం చి వచ్చే డ్రైనేజీ, స్టోర్మ్ వాటర్ తో హరిహర పురం కాలనీ, గాంధీనగర్, గ్రీన్ సిటీ కాలనీ, అఖిలాండేశ్వరి కాలనీ, పీవీఆర్ కాలనీ, మైల్ స్టోన్ కాలనీలకు ఇబ్బంది కలగకుండా 600 ఎంఎం డయా పైప్ లైన్ నిర్మాణం చేయాలని కోరారు.
ఈ పనులకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. పనులు ప్రారంభించే ముందు ఫారెస్ట్ కు ఆనుకొని ఉన్న అన్ని కాలనీల సంక్షేమ సంఘం సభ్యులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు.






