పాముకాటుకు గురైన ఇద్దరు మహిళలు
03-06-2026 12:16 AM
ఎర్రవల్లి జూన్ 2: ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో మంగళవారం రోజు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు మహిళా కూలీలను పాము కాటు వేసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ధర్మవరం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న సకినా బేగం (40) పుల్లమ్మ (43) అనే ఇద్దరు మహిళా కూలీలను అకస్మాత్తుగా పాము కాటేసింది.
వెంటనే స్పందించిన కార్యదర్శి నాగరాజు ఫీల్ అసిస్టెంట్ సాయిబాబా బాధితులను 108 లో అలంపూర్ దవాఖాన నాకు తరలించి చికిత్స అందించడంతో ఇద్దరి కూలీల పరిస్థితి నిలకడగా ఉందని, పెద్ద ప్రమాదం తప్పిందని కార్యదర్శి నాగరాజు తెలపడం జరిగింది. అధికారులు సకాలంలో స్పందించి ఇద్దరి కూలీల ప్రాణాలు కాపాడడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం పరిచారు.






