3 September, 2026 | 5:24 PM

డీఆర్‌డీఎల్ కృషి ప్రశంసనీయం

14-11-2024 | 02:12am

డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాధామోహన్ సింగ్

హైదరాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి) : డిఫెన్స్, జాతీయ భద్రత కోసం డీఆర్‌డీఎల్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాధామోహన్‌సింగ్ అన్నారు. ఆమె నేతృత్వంలోని డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండి ంగ్ కమిటీ అధ్యయనంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌ను సందర్శించారు.

డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి కొనసాగుతున్న పనులు, మిస్సైల్ అభివృద్ధిలో భవిష్యత్ మార్గదర్శకాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ... రక్షణ పరిశోధనా సంస్థలకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం లభిస్తున్నదన్నారు.