03-02-2026 02:31:57 PM
మునిపల్లి,(విజయక్రాంతి): గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న ఎండుగంజాయిని మునిపల్లి కంకోల్ టోల్ ప్లాజా(Kamkole Toll Plaza) వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులుమంగళవారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ సీఐ శంకర్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి హైదరాబాద్ వైపు ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలోనే ఓ బైక్ పై అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేయగా అందులో 728గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎండు గంజాయి ని సరఫరా చేస్తున్న వ్యక్తిని విచారించగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన మమ్మద్ యాకూబ్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పట్టుబడిన ఎండు గంజాయితోపాటు బైక్, సెల్ ఫోన్ లను సీజ్ చేసి స్వాధీన పర్చుకొని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కు తరలించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్సై లు అనుదీప్ , హన్మంతు, కానిస్టేబుల్స్ అరుణజ్యోతి, అంజిరెడ్డి సాయి శివకాంత్, రాజేష్ , శివకృష్ణ తదితరులు ఉన్నారు.