27 May, 2026 | 2:18 AM

సర్పంచ్ అయినా తన కష్టాన్ని నమ్ముకున్న వైనం

27-05-2026 01:47 AM

తన వృత్తిని వీడని ఆరేపల్లి సర్పంచ్

నిజాంసాగర్, మే 26 (విజయక్రాంతి): రాజకీయంలో చిన్నపాటి పదవి ఉంటేనే డాబు ప్రదర్శించే నేటి రోజుల్లో ఒక గ్రామ సర్పంచ్ అయ్యుండి తన వృత్తినే నమ్ముకుని ఎలాంటి రాజకీయ దర్పణం ప్రదర్శించకుండా తను నమ్ముకున్న వృత్తిని కొనసాగిస్తున్న వైనం. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ఆరేపల్లి గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన నందాస్ మోహన్ తనకున్న సొంత డాక్టర్ ద్వారా గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు.

ఆరెపల్లి గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వుడ్ కావడంతో రిజర్వేషన్ అనుకూలంగా ఉండడంతో పోటీలో నిలిచి ఆరేపల్లి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.ఒక్క గ్రామ ప్రథమ పౌరిడి గా పనిచేస్తూనే  తన జీవనోపాధి కోసం ట్రాక్టర్ నడుపుతూ  తాను నమ్ముకున్న కష్టం ద్వారానే కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్న సర్పంచ్ నందాస్ మోహన్ ను చూసి గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఈ విషయ మై గ్రామ సర్పంచ్ నందాస్ మోహన్ ను విజయ క్రాంతి ప్రతినిధి పలకరించగా తాను నమ్ముకున్న వృతి ద్వారా  డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పొహించడం లోనే సంతృప్తి వుంందని అయన పేర్కొన్నారు.